
హన్సిక విడాకులు: భరణం లేకుండానే విడిపోయిన హీరోయిన్
హీరోయిన్ హన్సిక, ఆమె భర్త సోహైల్ విడాకులు తీసుకున్నారు. మనస్పర్థల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు.




