పోలవరం ప్రాజెక్టును శుక్రవారం విదేశీ నిపుణులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్-1 నిర్మాణ పనులను వారు పరిశీలించనున్నారు. అమెరికాకు చెందిన జియాస్ ప్రాన్కో డి సిస్కో, డేవిడ్ బి.పాల్, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ పోలవరం ప్రాంతంలో పర్యటించనున్నార. డయాఫ్రం వాల్ గతంలో వర్షాలకు దెబ్బతిన్న నేపథ్యంలో నిపుణుల బృందం పరిశీలించనుంది.