రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ ప్రతాప్ సింగ్‌ను మైనింగ్ మాఫియా డ్రైవర్ ట్రక్కుతో ఢీకొట్టి, బైక్‌తో పాటు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. చక్ సుఖడ్ ప్రాంతంలో అటవీ భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై దాడులకు వెళ్లిన రేంజర్ వాహనాన్ని ఢీకొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.