
లిఫ్ట్ ఇస్తామని చెప్పి కదులుతోన్న వ్యాన్‌లో యువతిపై అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డిసెంబరు 30న అర్ధరాత్రి దాటిన తర్వాత, ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తున్న 23 ఏళ్ల మహిళను ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. ఆమెను గురుగ్రామ్ రోడ్డు వైపు తీసుకెళ్లి, రెండు గంటలకుపైగా కదులుతోన్న వ్యాన్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.




