పెన్షన్ హామీ మర్చిపోయారు: సబితారెడ్డి (వీడియో)

58చూసినవారు
TG: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. తెలంగాణ రాకముందు దివ్యాంగుల పెన్షన్ రూ.500 ఉండగా, కేసీఆర్ సీఎం అయ్యాక రూ.4000 వరకు పెంచారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4000 నుంచి రూ.6 వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్