బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

5చూసినవారు
TG: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వాలని గురువారం గ్రామ సర్పంచ్, రైతులు అమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రైతులను పరామర్శించేందుకు వెళుతుండగా మహేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. "మేము ఏమైనా దొంగలమా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు" అని మహేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్