సీటుకు రూ.5 కోట్లు వసూలు: మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆరోపణ

47చూసినవారు
సీటుకు రూ.5 కోట్లు వసూలు: మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆరోపణ
తృణమూల్ కాంగ్రెస్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారని ఆయన పేర్కొన్నారు. తనను కూడా డబ్బులు అడిగారని, అందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మమతా బెనర్జీ ఆహ్వానంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేసుకున్న ఆయన, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్