భారత మాజీ స్టార్ క్రీడాకారుడు కన్నుమూత

48చూసినవారు
భారత మాజీ స్టార్ క్రీడాకారుడు కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మాన్యువల్ ఫ్రెడరిక్ (78) శుక్రవారం బెంగళూరులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భారత హాకీ స్వర్ణ యుగానికి ఎంతో కృషి చేశారు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ ఆయనకు సంతాపం తెలిపారు. కేరళ నుండి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా ఫ్రెడరిక్స్ నిలిచారు.

సంబంధిత పోస్ట్