కెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా కేరళలో గుండెపోటుతో మృతి

44490చూసినవారు
కెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా కేరళలో గుండెపోటుతో మృతి
కెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా (80) కేరళలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళంలోని శ్రీధరీయం ఆయుర్వేద నేత్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం నడక సమయంలో హార్ట్ అటాక్ రావడంతో మరణించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయనతో కుమార్తె, వ్యక్తిగత వైద్యుడు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కెన్యా రాయబార కార్యాలయం మార్గదర్శకత్వంతో ఆ దేశానికి తరలించనున్నారు.
Job Suitcase

Jobs near you