ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భార్యపై ఆ పార్టీ మాజీ నేత రాజ్‌బల్లభ్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్జేడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దిష్టిబొమ్మలను తగలబెట్టారు. తేజస్వి యాదవ్.. ‘బీహార్ అమ్మాయిని కాకుండా.. వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఓట్ల కోసమే కులాన్ని ఉపయోగిస్తారా? పెళ్లి విషయంలో మాత్రం కులాన్ని పరిగణనలోకి తీసుకోరా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.