ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం అరెస్ట్ చేసింది. ఢిల్లీ జల్ బోర్డు (DJB) మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించిన టెండర్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణల కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఈ కేసులో జైన్‌తో పాటు మరో ఐదుగురిని ACB అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 2025లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా జైన్ సహా 14 మందిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.