మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన కన్నుమూత

116చూసినవారు
మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన కన్నుమూత
AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన కన్నుమూశారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1983లో గంటెల సుమన టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మృతదేహాన్ని నగరంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆమె మృతితో పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్