పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే

29చూసినవారు
పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే
మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ తలపెట్టిన రాస్తారోకో ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా తరలిరావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పృహ కోల్పోయారు. ఉదయం నుంచి ర్యాలీలు నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్