పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ (55) తీవ్ర గుండెపోటుతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను కరాచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బాసిత్ అలీ 1993-96 మధ్య పాక్ తరపున 19 టెస్టులు, 50 వన్డేలు ఆడి, మొత్తం 69 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2,123 పరుగులు చేశారు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు,
క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.