రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో మాజీ పోలీసు అధికారి రాంభరోస్ అలియాస్ రాజేంద్ర సిసోడియా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 16 ఏళ్ల యువతిని తన ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆగ్రా, లక్నో, గ్వాలియర్‌లలో రూపం మార్చుకుంటూ తిరిగిన నిందితుడు.. మథురలోని బృందావన్‌లో బుర్ఖా ధరించి, మహిళ వేషంలో ఉన్నప్పుడు రాజస్థాన్ పోలీసులకు చిక్కాడు.