మాజీ ప్రధాని సోదరిపై కోడిగుడ్లతో దాడి (వీడియో)

18756చూసినవారు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌పై గుర్తు తెలియని ఓ మహిళ కోడిగుడ్లతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అలీమా ఖాన్‌‌ను అక్కడ నుంచి తరలించారు. రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల జర్నలిస్టులతో అలీమా మాట్లాడుతున్న క్రమంలో ఈ దాడి జరిగింది. అలీమాపై గుడ్లు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్