మలేషియాలో అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన మహతీర్ మహమ్మద్ భార్య, డాక్టర్ సితి హస్మాహ్ మహమ్మద్ అలీ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్యంతో కౌలాలంపూర్‌లోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 28న మృతి చెందారు. మలేషియాలో తొలి తరం మహిళా వైద్యుల్లో ఒకరైన ఆమె గ్రామీణ వైద్యం, కుటుంబ నియంత్రణ, మహిళా ఆరోగ్యం కోసం సేవలందించారు. 2003లో దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన సెతియా మహ్కోట మలేషియా అవార్డును అందుకున్నారు.