ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. కీవ్‌పై మాస్కో భారీ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రీ పరుబీ దారుణ హత్యకు గురయ్యారు. లివివ్ ప్రాంతంలో ఆండ్రీ పరుబీని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.