AP: మాజీ మంత్రి R.S.D.P అప్పల నరసింహరాజు (82) కన్నుమూశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో అప్పల నరసింహరాజు మృతి చెందారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని పలువురు నాయకులు సంతాపం తెలిపారు. అప్పల నరసింహరాజు భీమిలి నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు.