మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్ గా పనిచేశారు. కాగా, 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు.