అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ కన్నుమూత

10చూసినవారు
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ కన్నుమూత
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ (84) న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. 46వ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 9/11 ఉగ్రదాడులకు ప్రతీకారంగా చేపట్టిన 'వార్‌ ఆన్‌ టెర్రర్‌'కు ప్రధాన రూపకర్తగా గుర్తింపు పొందారు. ఇరాక్‌పై 2003 దాడులకు ఆయన ఆరోపణలు పునాది వేశాయి. రిపబ్లికన్‌ నేతగా, కఠిన సంప్రదాయవాదిగా ఉన్న చెనీ, చివరి సంవత్సరాల్లో డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్