విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

13586చూసినవారు
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
AP: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్‌ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 27 సంవత్సరాలపాటు విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందిస్తూ పాడి రైతుల అభివృద్ధికి కృషి చేశారు. మొవ్వ గ్రామానికి చెందిన జానకిరామయ్య అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం స్వగ్రామంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్