వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లపై లాఠీఛార్జ్‌ (వీడియో)

17441చూసినవారు
AP: పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ‘పాప పరిహార పూజలు’ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులతో బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తలకు గాయమైనట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.

సంబంధిత పోస్ట్