
జింకను మింగి రోడ్డుపై అడ్డంగా పడిన కొండచిలువ
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ జింకను పూర్తిగా మింగిన తర్వాత రోడ్డుపై అడ్డంగా పడి కనిపించింది. పొట్ట ఉబ్బిపోయి, ముందుకు కదలడానికి కష్టమైంది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు, స్థానికులు ఆశ్చర్యపోయి, ఫోటోలు, వీడియోలు తీశారు. అటవీ సిబ్బందికి సమాచారం అందించగా వారు చేరుకునేలోపే అది అడవిలోకి వెళ్లిపోయింది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




