మధ్యప్రదేశ్‌లోని మండ్లా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహ నిమజ్జనం అనంతరం మండపం వేదికపై విశ్రాంతి తీసుకుంటున్న పలువురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ తీగ తెగిపడటం వల్ల మండపంలోకి కరెంట్ ప్రసరించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.