TG: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. అనంతరం లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.