విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఐదుగురు బాలికలు చేసిన సాహసం నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మోతీబీగా గ్రామంలో జరిగింది. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న బాలికలు విషం రుచి చూడటం కోసం పక్షులను చంపేందుకు ఉపయోగించే విషాన్ని నీటిలో కలిపి తాగారు. వారిలో 14 ఏళ్ల బాలిక కొద్దిగా మాత్రమే తాగి వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాపాయం తప్పింది. మిగిలిన నలుగురు బాలికలు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.