కొండచరియలు విరిగిపడి నలుగురు స్పాట్ డెడ్

18991చూసినవారు
సిక్కింలోని యాంగ్‌తాంగ్ నియోజకవర్గంలోని ఎగువ రింబిలో గురువారం రాత్రి భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఊహించని ప్రమాదం కారణంగా వరద నీరు ఉప్పొంగింది. ఒకవైపు వరద నీరు, మరోవైపు కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో నలుగురు స్పాట్‌లోనే మరణించారు. మరో ముగ్గురు తప్పిపోయారు. ప్రస్తుతం వారికోసం గ్రామస్తులు, SSB సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పొంగిపొర్లుతున్న హ్యూమ్ నదిపై పోలీసులు, స్థానిక ప్రజలు చెక్క దుంగలతో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు. దీని ద్వారా ఇద్దరు మహిళలను రక్షించారు.

సంబంధిత పోస్ట్