కోడి పుంజుకు నాలుగు కాళ్లు.. వీడియో వైరల్

39631చూసినవారు
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి పెంచుతున్న నాలుగు కాళ్లతో ఉన్న కోడి పుంజును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. ఈ పుంజు వింత ఆకృతిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, పందెం రాయుళ్లు ఈ పుంజును చూసి దాని సామర్థ్యంపై చర్చించుకుంటున్నారు. కొందరు దీనిని బ్రహ్మం గారి జోస్యంతో పోలుస్తుండగా, మరికొందరు దీనిని వింతగా అభివర్ణిస్తున్నారు.

సంబంధిత పోస్ట్