పాము కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతి

48చూసినవారు
పాము కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతి
TG: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగుపాము కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు విహాన్స్ మృతి చెందాడు. తండ్రి అనిల్ తెలిపిన వివరాల ప్రకారం, విహాన్స్ తన తమ్ముడు మన్విత్‌తో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా బండల మధ్య నుంచి వచ్చిన పాము కాటు వేసింది. వెంటనే పిల్లలను వరంగల్‌కు తరలించి చికిత్స అందించినప్పటికీ, విహాన్స్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్