గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

20చూసినవారు
గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
TG: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో సోమవారం విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కాసనగోడు గ్రామానికి చెందిన కుంచం జగదీష్, శ్రావణి దంపతుల పెద్ద కుమారుడు ఆయాన్(4)ను ఆంగన్వాడీ కేంద్రానికి పంపారు. అయితే ఆ బాలుడు బహిర్భూమి రావడంతో ఆయాకు విషయం చెప్పాడు. దీంతో ఆయా బయటకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రం ప్రహరి వెంట ఉన్న గోతిలోపడి బాలుడు చనిపోయాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్