TG: జగిత్యాల జిల్లా బీర్‌పూపూర్ మండలం తుంగూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్క కరవడంతో 4 ఏళ్ల బాలుడు రక్షిత రక్షిత్ మృతి చెందాడు. అయితే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా.. వీధి కుక్క అతడిపై దాడి చేసింది. దీంతో బాలుడు డ్రైనేజీలో పడిపోయాడు. బాలుడికి కుక్క కరిచిందని తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఎలాంటి చికిత్స అందించలేదు. రెండు రోజుల క్రితం రేబిస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.