నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్‌పాట్

75చూసినవారు
నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్‌పాట్
మధ్యప్రదేశ్ బుర్హన్‌పుర్‌లోని సిలంపురకు చెందిన నాలుగేళ్ల మేధాంశ్‌కు అదృష్టం వరించింది. లాటరీలో రూ.53 లక్షల విలువైన ఫార్చ్యునర్ కారు దక్కింది. స్థానికంగా నిర్వహించిన గర్భా ఉత్సవం సందర్భంగా శ్రీ సర్కార్ ధామ్ అనే వ్యక్తి నిర్వహించిన లాటరీలో బాలుడిని ఈ అదృష్టం వరించింది. ఈ లాటరీ టికెట్‌ను రూ.201 పెట్టి కిరణ్ రాయ్‌కర్ తన మనవడైన మేధాంశ్ పేరిట కొనుగోలు చేశారు.