TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశ చూపించి మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు విన్న స్థానికులు తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించి, నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.