TG: రాష్ట్రంలో నేటితో నయవంచనకు నాలుగేళ్లని కేటీఆర్ విమర్శించారు. నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి కొందరు పెద్దలు వరంగల్ వచ్చి రైతులకు గాలం వేశారన్నారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని, రైతుల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ కిరీటం పెడతామని మభ్యపెట్టారన్నారు. కాంగ్రెస్ కుట్రలు తెలిసి కూడా ఆ పార్టీని నమ్మితే.. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.