ఇందిరమ్మ ఇల్లు పేరుతో మోసం.. MRO సంతకం ఫోర్జరీ!

28చూసినవారు
TG: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం లక్ష్మీపురంలో ఇందిరమ్మ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి సైదిబాబు అనే వ్యక్తి కుక్కడపు రాములమ్మ అనే బాధితురాలి వద్ద డబ్బులు వసూలు చేసి మోసగించాడు. మండల రెవెన్యూ అధికారి (MRO) సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్