క్రైస్తవ మైనారిటీలకు ఉచితంగా బైకులు, కుట్టు మిషన్లు

16874చూసినవారు
క్రైస్తవ మైనారిటీలకు ఉచితంగా బైకులు, కుట్టు మిషన్లు
తెలంగాణలోని క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, యువతకు మోటార్ బైక్‌లు, ఈ-బైక్‌లు, స్కూటీలు, అలాగే చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించనుంది. 21–55 ఏళ్ల (కుట్టు మిషన్/వ్యాపారాలు), 21–50 ఏళ్ల (బైక్‌లు) క్రైస్తవ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు ఉండాలి. జులై 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్