
సాంకేతిక లోపంతో ఢిల్లీలో ఎతిహాద్ విమానం రద్దు (VIDEO)
సాంకేతిక కారణాల వల్ల అబుదాబి వెళ్లాల్సిన ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం (EY217) సెప్టెంబర్ 20న ఢిల్లీలో రద్దయింది. ఇవాళ రాత్రి 9.15 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు 200 మంది ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. బోయింగ్ 787 విమానంలో సమస్యను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.




