సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర
మోదీ పేరుతో “ఉచిత ఎలక్ట్రిక్ సైకిల్ పథకం” అంటూ వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది. ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తోందని చెబుతున్న ఆ వీడియో పూర్తిగా నకిలీదని వెల్లడించింది. AI, డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రధాని
మోదీ వాయిస్, విజువల్స్‌ను మార్ఫ్ చేసినట్లు తేలింది. ఇలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రూవ్ కాని లింకులు, వీడియోలను నమ్మవద్దని, అధికారిక ‘.gov.in’ వెబ్‌సైట్‌లను మాత్రమే నమ్మాలని సూచించారు.