గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి పొన్నం

7చూసినవారు
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి పొన్నం
తెలంగాణలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు జరుగనున్న ఈ ఉత్సవాల కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈసారి కూడా గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. శాంతి భద్రతలు, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్