ఫ్రీ కరెంట్, ఇంటికో ఉద్యోగం.. తేజస్వీ యాదవ్ ఎన్నికల హామీ

26555చూసినవారు
ఫ్రీ కరెంట్, ఇంటికో ఉద్యోగం.. తేజస్వీ యాదవ్ ఎన్నికల హామీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, మహాగఠ్‌బంధన్‌ కూటమి 'తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్‌' పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టోలో, అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామని తేజస్వీ యాదవ్‌ అన్నారు.