జూన్ 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉచిత చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ.75 లక్షల వ్యయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ, వానల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు జర్మన్ హ్యాంగర్లు, వాటర్‌ప్రూఫ్ పండళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తొక్కిసలాట నివారణకు కిలోమీటర్ల మేర ఇనుప జాలీ బారికేడ్లు సిద్ధం చేస్తున్నారు. అజంతా గేట్ నుంచి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ వరకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.