నిమ్స్ ఆస్పత్రిలో నేటి నుంచి పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు

38చూసినవారు
నిమ్స్ ఆస్పత్రిలో నేటి నుంచి పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
TG: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో ఆగస్టు 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ స్వయంగా తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్‌ కోసం ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌‌కి వెళ్లాలి. అక్కడ వివరాలు చెబుతారు. తద్వారా చిన్నారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

సంబంధిత పోస్ట్