
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు జులై 17న ప్రారంభం
దేశ రైల్వే చరిత్రలో తొలి హైడ్రోజన్ రైలు జులై 17న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్ మధ్య 10 కోచ్‌ల ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీనిని పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గాన్ని పైలట్ కారిడార్‌గా ఎంపిక చేశారు. ఈ సాంకేతికతతో భారతదేశం కూడా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన చేరింది.




