ఇంటర్ చదివిన అమ్మాయిలకు ఫ్రీగా పైలట్ ట్రైనింగ్

23చూసినవారు
ఇంటర్ చదివిన అమ్మాయిలకు ఫ్రీగా పైలట్ ట్రైనింగ్
TG: ఇంటర్‌ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్‌ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్‌ విద్యాశాఖ, ఇండిగో అనుబంధ సంస్థ ఇండిగోరీచ్‌ మధ్య ఎంవోయూ కుదిరింది. 'గివింగ్ వింగ్స్ టు ఫ్లై' ప్రోగ్రామ్ కింద కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్, ATR టైప్ రేటింగ్‌, ఉచిత వసతి, భోజనం, మెడికల్ ఇన్సూరెన్స్, మెంటార్‌షిప్ అందిస్తారు. 20 నెలలపాటు శిక్షణ ఉంటుంది. indigoreachgwf.scholarsbox.in/ లో అప్లై చేయాలి.

సంబంధిత పోస్ట్