శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

32చూసినవారు
శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ప్రతి నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. గత డిసెంబరు నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం, ప్రతి నెల చివరి రోజున కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు చెంచు భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలు, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. దర్శనానంతరం అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి సహకారం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్