శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం

56చూసినవారు
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం
AP: భక్తుల కోరిక మేరకు శ్రీశైల దేవస్థానం మంగళవారం నుంచి మళ్లీ ఉచిత స్పర్శ దర్శనాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతి వారం మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోజూ 1200 మందికి అవకాశం లభిస్తుంది. ఈసారి టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి అని దేవస్థాన అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్