భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ప్రకారం, డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు మినహా దాదాపు 70% న్యూజిలాండ్ ఎగుమతులపై
భారతదేశం సుంకాలను తగ్గించనుంది. కివీ పండ్లపై సుంకం పూర్తిగా ఎత్తేయనుంది. యాపిల్స్, మనూకా తేనె, అల్బుమిన్లపై దిగుమతి సుంకాలు తగ్గడంతో భారత మార్కెట్లో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ దాదాపు అన్ని రకాల భారతీయ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేయనుంది.