హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఎప్పటినుంచంటే?

27చూసినవారు
హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఎప్పటినుంచంటే?
TG: హైదరాబాద్ నగరవాసుల రవాణా కష్టాలను తీర్చేందుకు జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం వల్ల సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. రైల్వే శాఖకు ఏడాదికి రూ. 10 కోట్ల ఆదాయం వచ్చే ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఉచిత ప్రయాణంతో పాటు, రైల్వే స్టేషన్ల వద్ద కనెక్టివిటీ పెంచేందుకు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక షటిల్ బస్సులు నడపాలని, రద్దీ సమయాల్లో అదనపు రైళ్లు నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.