ఫ్రీలాన్సింగ్ వైపు మహిళల ఆసక్తి పెరుగుతోంది. కెరియర్‌కు బ్రేక్ ఇవ్వకుండా పని–వ్యక్తిగత జీవితానికి సమతుల్యత సాధించేందుకు నేటి మహిళలు గిగ్ వర్క్‌ను ఎంచుకుంటున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం గిగ్ వర్కర్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు మహిళే. ముఖ్యంగా మార్కెటింగ్, డిజైనింగ్ రంగాల్లో పురుషులకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ రంగంలో 35 ఏళ్లలోపు యువతే 70 శాతం ఉండటం గమనార్హం. స్కిల్ ఇండియా వంటి పథకాలతో నైపుణ్యాలు పెంచుకుంటూ మహిళలు కెరియర్‌లో దూసుకుపోతున్నారు.